కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
SDPT: వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. వన్ టౌన్ సీఐ వాసుదేవరావు వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన కాల్వ మమత భర్త నవీన్ ఇద్దరు కూతుళ్లతో కలిసి పట్టణంలో నివాసం ఉంటున్నారు. కుటుంబ కలహాలతో క్షణికావేశంలో మమత ఇంట్లో ఉరి వేసుకుంది. ఈ ఘటనపై వన్ టౌన్ పోలీసులు శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.