పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

ఖమ్మం వైద్య కళాశాలలో నిపుణులు పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు శుక్రవారం ప్రిన్సిపల్ డా. శంకర్ తెలిపారు. మొత్తం 12 ప్రొఫెసర్, 26 అసోసియేట్ ప్రొఫెసర్లు, 8 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 36 సీనియర్ రెసిడెంట్స్, 2 ఐసీయూ స్పెషలిస్టుల పోస్టులను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. ఆసక్తి కలిగిన వారు ఈనెల 13లోపు https:/gmckhammam.org వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.