అప్పు విషయంలో దాడి... కేసు నమోదు చేసిన పోలీసులు
NDL: కొలిమిగుండ్ల మండలం కోటపాడు గ్రామంలో ఇవాళ అప్పుల విషయంలో వెంకట్రాముడు లక్ష్మీదేవి దంపతులపై అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు దాడి చేసినట్టు కొలిమిగుండ్ల సీఐ రమేష్ బాబు తెలిపారు. కోటపాడు గ్రామానికి చెందిన చంద్రబాబు, ఎర్రన్న, అప్పు చెల్లించే విషయంలో వెంకట్ రాముడు దంపతులతో ఘర్షణ పడ్డారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.