తాను మరణించిన ముగ్గురికి ప్రాణం పోశాడు
BHNG: తుక్కపురానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కంబాల శంకర్ (31) గత నెల 28న ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలు అవ్వడంతో ఆసుపత్రికి తరలించగా బ్రెయిన్‌డెడ్‌తో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. జీవన్ దాన్ తెలంగాణా బృందం సూచనతో కుటుంబం అవయవదానానికి అంగీకరించింది. దీంతో రెండు కిడ్నీలు, కాలేయం దానం చేసి ముగ్గురు రోగులకు కొత్త జీవితం ప్రసాదించారు.