బాపట్ల జిల్లాలో యూరియా పుష్కలంగా ఉంది: కలెక్టర్
BPT: బాపట్ల జిల్లాలో యూరియాకు ఎలాంటి కొరత లేకుండా రైతులకు పుష్కలంగా అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. శనివారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆర్‌ఎస్‌కేలు, PACS కేంద్రాల ద్వారా 112 మెట్రిక్ టన్నుల యూరియాను 978 మంది రైతులకు పంపిణీ చేసినట్టు చెప్పారు. ఇంకా 114 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలో ఉందని కలెక్టర్ వెల్లడించారు.