అంబికా కార్యాలయంలో సభ్యత్వ నమోదు

ATP: అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తన కార్యాలయంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. యువత పెద్ద సంఖ్యలో వచ్చి సభ్యత్వం తీసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. సభ్యత్వంతో రూ.5 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందని అన్నారు. అలాగే సభ్యుడు మరణిస్తే రూ.10 వేలు మట్టి ఖర్చులకు అందిస్తారని తెలిపారు.