మంత్రి అడ్లూరికి సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ వినతి
JGL: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను సోమవారం ధర్మపురి క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ కలిశారు. జిల్లాలోని మున్సిపాలిటీల్లో కో-ఆప్షన్ సభ్యులుగా సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ ప్రతినిధులను నియమించాలని వినతిపత్రం అందజేశారు.