మాదకద్రవ్యాల నిర్మూలనకు ‘అభ్యుదయం సైకిల్ యాత్ర’
SKLM: గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలన కోసం విశాఖపట్నం రేంజ్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అభ్యుదయం సైకిల్ యాత్ర’ మంగళవారం శ్రీకాకుళం చేరుకుంది. డీఐజీ గోపీనాథ్ జట్టి, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి ర్యాలీని ప్రారంభించారు. డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తూ ప్రజలతో ‘డ్రగ్స్ వద్దు–జీవితమే ముద్దు’ అని ప్రతిజ్ఞ చేయించారు.