జీలుగుమిల్లి ముత్యాలమ్మ ఆలయంలో హుండీ చోరీ
ELR: జీలుగుమిల్లి మండలం పరిధిలోని రాచన్నగూడెం గ్రామంలోని శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో సోమవారం రాత్రి దుండగులు తాళాలు బద్దలు కొట్టి హుండీ ఎత్తుకెళ్లారు. మంగళవారం ఉదయం పూజలకు వెళ్లిన అర్చకులు ఘటనను గుర్తించి గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు.