మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు
అనంతపురం మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీ చేశారు. టౌన్ ప్లానింగ్ సెక్షన్ కార్యాలయంలో ప్రత్యేకించి ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. బిల్డింగ్ పర్మిషన్‌లో అవకతవకలు జరిగాయా అన్నకోణంలో విచారణ చేపట్టారు. టౌన్ ప్లానింగ్ సెక్షన్‌లో ప్రతి ఫైల్‌ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సోదాలలో ఏసీబీ డీఎస్పీ ప్రసాద్ రెడ్డి, సీఐ హమీద్ ఖాన్ ఉన్నారు.