జిల్లాలో డెవిల్ ఫిష్ కలకలం
NLG: జిల్లాలో డెవిల్ ఫిష్ కలకలం రేపింది. చిట్యాల మండలం పెద్దకాపర్తి చెరువులో భారీగా డెవిల్ ఫిష్‌లు చేరాయి. ఈ ఫిష్‌లు వలలను ధ్వంసం చేస్తున్నాయని మత్స్యకారుల ఆందోళన పడుతున్నారు. అలాగే చెరువులో ఉన్న ఇతర చెపలను తినేస్తున్నాయని వాపోతున్నరు. తీవ్ర నష్టం చేస్తున్న డెవిల్ ఫిష్ నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.