ఏటీసీ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్

ఏటీసీ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్

GDWL: జిల్లాలోని నిరుద్యోగ యువత అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సంతోష్ బుధవారం ఓ ప్రకటనలో దెలిపారు. నిరుద్యోగులకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ITIలను ప్రభుత్వం ఏటీసీ సెంటర్ల్‌గా అప్‌గ్రేడ్ చేసిందన్నారు. అభ్యర్థులు సమీప ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో సంప్రదించి, ఈనెల 28వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.