ఆలివ్ రిడ్లే తాబేళ్ల కేంద్రాన్ని సందర్శించిన జేసీ

SKLM: సంతబొమ్మాళి మండలం భావనపాడు ట్రీ ఫౌండేషన్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా నిర్వహించిన సముద్ర తాబేళ్ల సంరక్షణ కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ అహమ్మద్ ఫర్మాన్ ఖాన్ ఆదివారం సందర్శించారు. 420 తాబేళ్ళ పిల్లలను సముద్రంలో విడిచిపెట్టారు. ఇందులో భావనపాడు సర్పంచ్ బుడ్డ మోహన్ రెడ్డి, జీరు బాబురావు, ట్రీ ఫౌండేషన్ జిల్లా కోఆర్డినేటర్ సోమేశ్వరరావు పాల్గొన్నారు.