VIDEO: పురుగులమందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం

VIDEO: పురుగులమందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం

KMM: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సత్తుపల్లి మండలం చెరుకుపల్లిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మడకం దేవయ్య భార్యతో గొడవపడి, మద్యం మత్తులో పురుగుమందు తాగినట్లు స్థానికులు తెలిపారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించారు. బాధితుడిని మెరుగైన చికిత్స నిమిత్తం ఖమ్మం తరలించారు.