4,000 కోట్ల లీటర్ల నిల్వలున్నాయ్: కేంద్రం
దేశంలో ఇంధన నిల్వలు తక్కువగానే ఉన్నాయని వస్తున్న వార్తలపై కేంద్రం మరోసారి స్పందించింది. దేశంలో ముడిచమురు, రిఫైన్డ్ పెట్రోలియం ఉత్పత్తుల రూపంలో 250 మిలియన్ బ్యారెళ్లు(దాదాపు 4000 కోట్ల లీటర్లు) ఇంధన నిల్వలున్నాయని స్పష్టం చేసింది. ఇవి 7-8 వారాల వరకు సరిపోతాయని వెల్లడించింది. ప్రస్తుతం రష్యా నుంచి ఎక్కువ మొత్తంలో చమురు దిగుమతి అవుతుందని తెలిపింది.