సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు పూర్తి: కిషన్ రెడ్డి
HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రపంచస్థాయి సౌకర్యాలతో రూపుదిద్దుకుంటోంది. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ఈ స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. మొత్తం రూ. 714.73 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌లో ఇప్పటి వరకు 46 శాతం పనులు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం 'X' వేదికగా వెల్లడించారు.