'ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలి'
SRCL: ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని పెద్ద లింగాపూర్ సర్పంచ్ గన్నేరం వసంత అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్‌లో రోడ్డు భద్రతపై సోమవారం ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం వల్ల మీకే కాకుండా ఎదుటి వారికి కూడా ఎటువంటి ప్రమాదాలు జరగవన్నారు.