తాడిపర్తిలో పశువులకు ఉచిత టీకాలు
WNP: గోపాల్ పేట మండలం తాడిపర్తి గ్రామంలో బుధవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమం నిర్వహించారు. గోపాల్ పేట పశువైద్య అధికారి డాక్టర్ ఆంజనేయులు స్వయంగా పశువులకు టీకాలు వేశారు. ఈ మేరకు గ్రామ పశుకాపరులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ పశువులకు టీకాలు వేయించుకున్నారు.