సహకార సంఘం లో రైతులకు అందుబాటులో యూరియా

PDPL: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మంథనిలో 900 యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయని మంథని సింగిల్ విండో ఛైర్మన్ కొత్త శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం సాయంత్రం పీఎసీఎస్ మంథనిలో సింగిల్ విండో ఛైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ.. యూరియా బస్తాల కోసం వచ్చే రైతులు తమ వెంట పట్టా దారు పాసు పుస్తకం, ఆధార్ జీరాక్స్ ప్రతులు తమ వెంట తీసుకు రావాలని కోరారు.