శిథిలావస్థకు చేరిన భవనం.. భయాందోళనలో విద్యార్థులు

శిథిలావస్థకు చేరిన భవనం.. భయాందోళనలో విద్యార్థులు

ASR: జీకే వీధి మండలం గుమ్మిదేవుల పంచాయతీలోని మాదిగ మల్లు పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. గోడల పగుళ్లు, పైకప్పు లీకులతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ చదువుతున్నారు. బెంచీలు లేక నేలపైనే కూర్చునే దుస్థితి నెలకొంది. కనీస వసతులు కల్పించాలని హెడ్మాస్టర్ కోరగా, నూతన భవనం లేదా మరమ్మతులు చేపట్టి విద్యార్థుల భద్రతను కాపాడాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.