సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో గుర్తుతెలియని వృద్ధుడు మృతి

HYD: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లోని ప్లాట్ ఫాంపై ఓ గుర్తుతెలియని వృద్దుడి(80) మృతదేహాన్ని జీఆర్పీ పోలీసులు స్వాధీనం చేసుకుని మార్చురీకి తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆదివారం ఉదయం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లోని ఒకటో నంబరు ప్లాట్ ఫాంపై ఓ వృద్ధుడు అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు గుర్తించిన ప్రయాణికులు విషయాన్ని జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించారు.