VIDEO: వైభవంగా వైకుంఠ దీపోత్సవం

VIDEO: వైభవంగా వైకుంఠ దీపోత్సవం

WGL: జిల్లాలో వైకుంఠ దీపోత్సవం భక్తి శ్రద్ధల మధ్య ఆదివారం వైభవంగా జరిగింది. రాయపర్తి మండలం వెంకటేశ్వరపల్లి శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో వికాస తరంగిణి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో చుట్టుపక్కల గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వందలాది దీపాల వెలుగులో దేదీప్యమానంగా, వెంకటేశుని నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది.