రోడ్డు ప్రమాదంలో వృద్ధుడికి గాయాలు
BPT: సంతమాగులూరు మండలం పుట్టవారి పాలెం సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వృద్ధుడు గాయపడ్డాడు. వినుకొండ మండలం కొప్పుకొండకు చెందిన ఏ.వెంకటేశ్వర్లు (60) రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టింది. దీంతో అతనికి తీవ్ర గాయాలు కాగా, స్థానికులు సమాచారం ఇవ్వడంతో 108 సిబ్బంది చేరుకుని ప్రథమ చికిత్స అందించారు.