మీటర్లు లేని ఇళ్లపై విద్యుత్ శాఖ అధికారుల కొరడా
VKB: కొడంగల్ మండలం ధర్మాపూర్ గ్రామంలో శనివారం విద్యుత్ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మీటర్లు లేకుండా ఉపయోగించుకుంటున్న ఇంటి కనెక్షన్లను తొలగించారు. మీటర్లు లేని కనెక్షన్లు చట్ట విరుద్ధమైన చర్య అని, ప్రతి ఒక్కరూ మీటర్లు అమర్చుకోవాలని గ్రామస్తులకు సూచించారు.