వాడబలిజల సమస్యలు పరిష్కరిస్తాం: MLA

వాడబలిజల సమస్యలు పరిష్కరిస్తాం: MLA

BDK: ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రాచలంలో వాడబలిజ సేవ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. భద్రాచలం పట్టణంలోని టీఎన్జీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భద్రాచలం MLA డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొని వాడబలిజ జెండాను ఆవిష్కరించారు. వాడబలిజల సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు.