కొట్లాట కేసులో ఇరువర్గాలకు శిక్ష విధించిన న్యాయస్థానం
SRPT: కోదాడ మండలం నల్లబండగూడెంలో 2017లో జరిగిన పరస్పర దాడుల కేసులో కోదాడ మొదటి అదనపు న్యాయస్థానం తీర్పు వెలువరించింది. కలకుంట రంగయ్య వర్గానికి చెందిన ఆరుగురికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.2,000 జరిమానా విధించింది. అలాగే కలకుంట సర్వయ్య వర్గానికి చెందిన నలుగురికి ఒక్కొక్కరికి రూ.1,000 చొప్పున జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.