'వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుంది'

'వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుంది'

AKP: వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని హోంమంత్రి వంగలపూడి అనిత హామీ ఇచ్చారు. ఎస్ రాయవరం మండలం బంగారమ్మపాలెం మత్స్యకార గ్రామాన్ని సందర్శించి బాధితులు పరామర్శించారు. జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మత్స్యకారుల కుటుంబాలకు నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. పంట నష్టం ఆస్తి నష్టం వివరాలను అధికారులు సేకరిస్తున్నట్లు ఆమె తెలిపారు.