మొక్కజొన్న రైతులకు కీలక సూచన
MHBD: కేసముద్రం వ్యవసాయ మార్కెట్ అధికారులు మొక్కజొన్న రైతులకు పలు సూచనలు చేశారు. మార్కెఫెడ్ ద్వారా మక్కజొన్నలు కొనుగోలు చేసిన బస్తాలు అధికంగా నిల్వ ఉన్నందున, అలాగే మార్కెట్ యార్డుకు అధికంగా మక్కజొన్నలు వస్తున్నందున, స్థలం సరిపడా లేదన్నారు. ఈ క్రమంలో తాము తేదీ ప్రకటించే వరకు మక్కజోన్నలు ఎవరు కూడా కేసముద్రం మార్కెట్ యార్డుకు తీసుకురావద్దని సూచించారు.