అయ్యప్ప భక్తులకు ప్రత్యేక రైలు

అయ్యప్ప భక్తులకు ప్రత్యేక రైలు

ASF: కాగజ్ నగర్ నుంచి శబరిమల వెళ్ళే అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం కాగజ్ నగర్ నుంచి కొల్లాం జంక్షన్ వరకు జనవరి 3, 2026 నుంచి ప్రత్యేక రైలు నడపనున్నామని MLA హరీష్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో రైల్వే GMని శబరిమలకు ప్రత్యేక రైలు నడపాలని కోరానని, దానికి అనుగుణంగా ప్రత్యేక రైలు నడపనున్నట్లు తెలిపారు. అయ్యప్ప భక్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.