VIDEO: విద్యుత్ స్తంభంను ఢీ కొట్టిన గుర్తు తెలియని వాహనం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో స్తంభం విరిగిపోయింది. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టు స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. సమాచారం అందిన వెంటనే విద్యుత్ శాఖ సిబ్బంది స్పందించి పరిస్థితిని చక్కదిద్దారు. సీసీ కెమెరాల్లో ప్రమాద దృశ్యాలు రికార్డు అయ్యాయి.