రూరల్ కార్యదర్శులకు ఎంపీడీవో సూచనలు

రూరల్ కార్యదర్శులకు ఎంపీడీవో సూచనలు

SKLM: రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో వీ. ప్రకాశరావు గురువారం పంచాయతీ కార్యదర్శులతో రివ్యూ నిర్వహించారు. సచివాలయం సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలని ఆయన సూచించారు. సచివాలయం వారీగా సర్వేలపై పురోగతి చూపాలని, వాటర్ ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో సూర్యనారాయణ, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.