'పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడులను నిలిపివేయాలి'

KMM: పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడులను నిలిపివేయాలని PYL రాష్ట్ర అధ్యక్షుడు రాకేష్ తెలిపారు. బుధవారం కామేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులతో సెమినార్ నిర్వహించారు. పాలస్తీనాపై ఇజ్రాయిల్ కొన్నేళ్ల నుంచి యుద్ధం చేస్తూ, వేల మంది ప్రాణాలను బలికొందని చెప్పారు. ఈనెల 7న ఖమ్మంలో పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా జరిగే ర్యాలీని జయప్రదం చేయాలని పేర్కొన్నారు.