మంత్రి నిమ్మల రామానాయుడుకు ఎమ్మెల్యే వినతి
ATP: యాడికిలో జరగనున్న జలధార కార్యక్రమానికి విచ్చేసిన నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జీడిపల్లి నుంచి బీటీపీ కాలువకు భూములు ఇచ్చిన రైతులకు పరిహారం అందించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న నిధులను వీలైనంత త్వరగా మంజూరు చేసి రైతుల ఖాతాల్లో జమ చేయాలని మంత్రికి విన్నవించారు.