'సోషల్ మీడియా పోస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలి'
W.G: నరసాపురం మండలం సీతారామపురం ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేశామని, సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని డీఎస్పీ సుధాకర్ హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా పోస్టులు పెడితే ఉపేక్షించబోమన్నారు. ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మవద్దని, సోషల్ మీడియా పోస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.