పొన్నూరుకు 11వ ర్యాంక్: కమిషనర్

GNTR: స్వచ్ఛ భారత్ మిషన్ ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణలో పొన్నూరు పురపాలక సంఘానికి 11వ ర్యాంకు వచ్చిందని మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ల రమేశ్ బాబు గురువారం తెలిపారు. బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత పట్టణంగా తీర్చిదిద్దినందుకు స్వచ్ఛ భారత్ మిషన్ ఈ ర్యాంకు ప్రకటించిందన్నారు. ఈ ర్యాంకు రావడానికి సహకరించిన సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.