రూ.3లక్షల మద్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు

రూ.3లక్షల మద్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు

KMM: లోక్‌సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా పోలీస్, ఎక్సైజ్ అధికారులు గురువారం నిర్వహించిన వేర్వేరు దాడుల్లో రూ.3లక్షల విలువైన మద్యం, ఇతర మత్తు పదార్థాలు పట్టుకుని 40మందిపై 56కేసులు నమోదు చేసినట్లు జిల్లా వ్యయ పరిశీలన నోడల్ అధికారి మురళీధర్  రావు తెలిపారు. రూ.50,400 విలువైన 1,440కిలోల ప్రజాపంపిణీ బియ్యం పట్టుకుని ఒక వ్యక్తిపై కేసు నమోదు చేశారు.