'అటవీ సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర ఎంతో గొప్పది'

MBNR: అటవీ సంరక్షణలో వన్య ప్రాణుల సంరక్షణలో అటవీ శాఖ అధికారుల పాత్ర ఎంతో గొప్పదని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా అమరవీరుల స్థూపానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి సత్యనారాయణ పాల్గొన్నారు.