తాటి చెట్టు పైనుంచి పడి గీత కార్మికునికి గాయాలు

తాటి చెట్టు పైనుంచి పడి గీత కార్మికునికి గాయాలు

సిరిసిల్ల: చందుర్తి మండలంలోని జోగపూర్ గ్రామానికి చెందిన పల్లి రవి గౌడ్ అనే గీత కార్మికుడు ఆదివారం ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుంచి జారిపడి గాయపడ్డాడు. రవి వృత్తి రీత్య ప్రతి రోజు మాదిరిగానే తాటి చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు మోకు జారీ కిందపడగా తీవ్ర గాయాలయ్యాయి. చుట్టూ ప్రక్కల వారు గమనించి రవిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.