నేడు పాఠశాలలకు సెలవు

శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వ ప్రైవేటు అంగన్వాడి కేంద్రాలకు ఇవాళ సెలవుదినంగా ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ప్రకటించారు. మంగళవారం ఉదయం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు గమనించాలని ఆయన స్పష్టం చేశారు.