GOOD NEWS: త్వరలో ఎకరాకు రూ. 9,600
TG: రాష్ట్రంలో కూరగాయల కొరతను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 10వేల ఎకరాల్లో కూరగాయల సాగు ప్రోత్సహించే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రైతులపై భారం తగ్గించేందుకు ఎకరాకు రూ.9,600 సబ్సిడీని నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనుంది. సిద్ధిపేట ములుగు, జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నర్సరీలు ఈ ప్రాజెక్టు కోసం నాట్లు సిద్ధం చేస్తున్నాయి.