సమస్యలు పరిష్కరించాలని అ. కలెక్టర్‌కు వినతి
MHBD: జిల్లాలోని కల్వల మోడల్ స్కూల్, హాస్టల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని SFI జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గందసిరి జ్యోతి బసు, పట్ల మధులు డిమాండ్ చేశారు. శుక్రవారం SFI జిల్లా కమిటీసభ్యులు జిల్లా అదనపు కలెక్టర్ అనిల్ కుమార్‌కు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో విఫలమైన SO, వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలన్నారు.