'పేద విద్యార్థులే ఉన్నత లక్ష్యాలను చేరుకుంటారు'

MBNR : బాలానగర్ మండలం పెద్దరేవల్లిలో శనివారం జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో మంచినీటి కేంద్రాన్ని రాష్ట్ర సింగరేణి సీఎండీ బలరాం నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నానని, ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని, పేద విద్యార్థులే ఉన్నత లక్ష్యాలను చేరుకుంటారన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.