దోర్నాలలో కొత్త స్కాం

ప్రకాశం: దోర్నాలలో HUGE యాప్ స్కాం వెలుగులోకి వచ్చింది. వీడియోలు చూసి డబ్బు సంపాదించవచ్చని యాప్ ప్రతినిధులు చెప్పడంతో వందలాది మంది రూ. లక్షల పెట్టుబడి పెట్టి మోసపోయారు. యాప్‌లో డబ్బులు పెట్టగా తొలుత కొంతమేర డబ్బులు జమ చేశారు. ఇది నమ్మి మరికొంత మంది పెద్ద ఎత్తున డిపాజిట్లు చేశారు. ఆ తర్వాత యాప్ పనిచేయడం మానేసింది.