పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది
NGKL: వంగూరు మండలంలోని 27 గ్రామపంచాయతీలకు గురువారం సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల కేంద్రంలో సిబ్బందికి విధులను కేటాయించారు. విధులు కేటాయించిన అనంతరం సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు వాహనాల ద్వారా తరలించారు.