VIDEO: అత్త, వదినపై కత్తితో దాడి.. పరిస్థితి విషమం
KKD: ఏలేశ్వరం మండలం తిరుమాలి గ్రామంలో అల్లుడు పెంటపాటి హరిబాబు మంగళవారం అత్త, వదినపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో అత్త పరిస్థితి విషమంగా ఉండగా, వదినకి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబంలో జరిగిన గొడవ కారణంగా కోపోద్రిక్తుడై మద్యం మత్తులో ఈ దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.