గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ITDA-PO

గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ITDA-PO

CTR: పుంగనూరు మేలుపట్ల గిరిజన బాలికల గురుకుల పాఠశాలను శనివారం ITDA-PO సుజాత తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, తరగతి గదులు, వంట గది, పిల్లలు తినే భోజనాన్ని పరిశీలించారు. తర్వాత విద్యార్థులతో మమేకమై విద్య బోధన, అభ్యసన ప్రక్రియ, పాఠశాలలోని సౌకర్యాల గురించి అడిగి తెలుసుకుని సంతృప్తిని వ్యక్తం చేశారు. విలువలతో కూడిన విద్యా బోధన చేయాలని ఉపాధ్యాయులు సూచించారు.