మదనపల్లిలో ఝార్ఖండ్ యువకుడు ఆత్మహత్య
అన్నమయ్య: మదనపల్లి మండలంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఝార్ఖండ్‌కు చెందిన మోతి రాజువార్(24) ఉపాధి కోసం కొంతకాలం క్రితం మదనపల్లికి వచ్చి, సెంట్రింగ్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. బుధవారం రాత్రి పనిచేసే ప్రాంతం పక్కనే చెట్టుకు ఉరి వేసుకున్నాడు. అదే రాత్రి కుటుంబీకులతో ఫోన్‌లో గొడవ జరిగినట్లు తోటి పనివారు తెలపగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.