'చివరి గింజ కొనుగోలు వరకు అండగా ఉండాలి'

'చివరి గింజ కొనుగోలు వరకు అండగా ఉండాలి'

SRCL: ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఉత్పత్తుల చివరి గింజ కొనుగోలు వరకూ రైతులకు అధికారులు అండగా ఉండాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సూచించారు. ఖరీఫ్ సీజన్ 2025 - 2026 వరి, పత్తి, మక్కల కొనుగోళ్లపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించగా, ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, కలెక్టర్ హాజరయ్యారు.