ప్రభుత్వ పాఠశాలలో శానిటేషన్ తనిఖీలు

మేడ్చల్: తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాంతంలో మునిసిపల్ అధికారులు నేడు శానిటేషన్ తనిఖీలు నిర్వహించారు. ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండటంతో పాటు, పాఠశాల గదులలో శుభ్రత పాటించాలని సూచించారు. అటు అధ్యాపక బృందానికి సైతం పలు సూచనలు చేసినట్లుగా వారు పేర్కొన్నారు.