టెట్ పరీక్ష ఫీజులను తగ్గించాలని వినతి
ADB: టీఈటీ (TET) పరీక్ష ఫీజులను తగ్గించాలని కోరుతూ జిల్లాకు చెందిన నిరుద్యోగ యువకులు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేశ్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులపై ఆర్థిక భారం పడకుండా చూడాలని, అభ్యర్థుల సొంత జిల్లాల్లోనే పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఇందులో ఏజెన్సీ సాధన కమిటీ నాయకులు సోమేశ్, భూక్యా కుమార్ పాల్గొన్నారు.